పెళ్లిచూపులు దర్శకుడితో వెంకీ | pelli choopulu fame Tarun Bhaskar Movie With Venkatesh | Sakshi
Sakshi News home page

పెళ్లిచూపులు దర్శకుడితో వెంకీ

Jul 30 2016 9:48 AM | Updated on Sep 4 2017 7:04 AM

పెళ్లిచూపులు దర్శకుడితో వెంకీ

పెళ్లిచూపులు దర్శకుడితో వెంకీ

రిలీజ్కు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెళ్లిచూపులు సినిమా, రిలీజ్ తరువాత కూడా అదే హవాను కంటిన్యూ చేస్తోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్నే...

రిలీజ్కు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెళ్లిచూపులు సినిమా, రిలీజ్ తరువాత కూడా అదే హవాను కంటిన్యూ చేస్తోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్నే సాధించింది. షార్ట్ ఫిలింస్తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, ఈ సినిమాతో వెండితెర మీద కూడా సత్తా చాటాడు. దీంతో క్రేజీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి.

తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు కథను ముందుగా సురేష్ బాబుకు చెప్పాడు. సురేష్ స్వయంగా సినిమాను నిర్మించకుండా రాజ్ కందుకూరి నిర్మాణంలో తన సమర్పణలో సినిమాను రూపొందించారు. అయితే పెళ్లిచూపులు ఫస్ట కాపీ చూసిన సురేష్ బాబు వెంటనే తరుణ్ భాస్కర్కు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమా అవకాశం ఇచ్చాడు.

తాజాగా సురేష్ ప్రొడక్షన్స్లో తరుణ్ చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం బాబు బంగారం రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్, తరువాత సాలాఖద్దూస్ రీమేక్లో నటించనున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement