బల్గేరియా వెళ్లారయా | NTR to travel to Bulgaria | Sakshi
Sakshi News home page

బల్గేరియా వెళ్లారయా

Aug 24 2019 12:16 AM | Updated on Aug 24 2019 12:16 AM

NTR to travel to Bulgaria - Sakshi

బల్గేరియా వెళ్లింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం. నెక్ట్స్‌ మూడు నాలుగు వారాలు అక్కడే మకాం. ఓ పెద్ద యాక్షన్‌ సీన్‌ చిత్రీకరించుకుని రావడం ప్లాన్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొత్త షెడ్యూల్‌ బల్గేరియాలో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో కేవలం ఎన్టీఆర్‌ మాత్రమే పాల్గొంటారని సమాచారం. చిత్రబృందం ఆల్రెడీ గురువారం బల్గేరియా బయలుదేరింది. ఈ నాలుగు వారాల షెడ్యూల్‌లో ఓ పెద్ద యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేశారు రాజమౌళి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 31న రిలీజ్‌ కానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement