సంజుని రిజెక్ట్‌ చేశా | Not just Ranbir Kapoor, even Aamir Khan wanted to play Sanjay Dutt in his biopic | Sakshi
Sakshi News home page

సంజుని రిజెక్ట్‌ చేశా

May 25 2018 5:07 AM | Updated on May 25 2018 5:07 AM

 Not just Ranbir Kapoor, even Aamir Khan wanted to play Sanjay Dutt in his biopic  - Sakshi

దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ, మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ గురించి తెలిసిందే. ‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి బ్లాక్‌బాస్టర్స్‌ ఇచ్చారు. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ హిరాణీ సంజయ్‌దత్‌ బయోపిక్‌ ‘సంజు’ రూపొందించిన విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ను ఓ పాత్ర కోసం సంప్రదించారట హిరాణీ. ఆ విషయం గురించి ఆమిర్‌  మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ çసంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌ దత్‌ క్యారెక్టర్‌  చేయమని హిరాణీ నన్ను అప్రోచ్‌ అయ్యాడు. ఫెంటాస్టిక్‌ రోల్‌. సినిమా ఎక్కువగా తండ్రీ కొడుకుల రిలేషన్‌షిప్‌ మీద నడుస్తుంది. సంజూ రోల్‌ అత్యద్భుతంగా ఉంది. యాక్టర్‌గా సంజూ రోల్‌ నాకు బాగా నచ్చింది. ఒకవేళ చేస్తే సంజూ రోల్‌ చేస్తా. కానీ అది ఆల్రెడీ రణ్‌బీర్‌ కపూర్‌ చేస్తున్నాడు కాబట్టి వేరే ఏ రోల్‌ చేయను అని చెప్పేశాను’’ అని పేర్కొన్నారు. ‘సంజు’ సినిమా జూన్‌29న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement