ఆ హీరోల వల్ల నరకం చూశా! | not comfortable with that hero says katrina kaif | Sakshi
Sakshi News home page

ఆ హీరోల వల్ల నరకం చూశా!

Dec 22 2014 10:58 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఆ హీరోల వల్ల నరకం చూశా! - Sakshi

ఆ హీరోల వల్ల నరకం చూశా!

‘హీరోలతో మంచిగా ఉంటేనే కెరీర్ సుదీర్ఘ కాలం కొనసాగుతుంది’ అనుకునే హీరోయిన్లున్న నేటి రోజుల్లో...

 ‘హీరోలతో మంచిగా ఉంటేనే కెరీర్ సుదీర్ఘ కాలం కొనసాగుతుంది’ అనుకునే హీరోయిన్లున్న నేటి రోజుల్లో... అందుకు భిన్నంగా హీరోపై సూటిగా విమర్శలు గుప్పించే హీరోయిన్లూ ఉన్నారు. కత్రినాకైఫ్ ఇటీవల బాలీవుడ్ హీరోలను మీడియా సాక్షిగా చెడుగుడు ఆడేశారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన కత్రినాను... ‘బాలీవుడ్‌లో ఏ హీరో పక్కన మీరు కంఫర్ట్‌గా ఫీలయ్యారు?’ అని ఓ విలేకరి అడిగేసరికి, కత్రినా తాచుపాములా అంతెత్తు లేచారు.
 
 ‘‘కంఫర్ట్ సంగతి దేవుడెరుగు. కొంతమంది హీరోల పుణ్యమా అని నరకం చూసిన రోజులున్నాయి. కనీసం స్నానం చేసి సెట్‌కి రావాలనే కామన్ సెన్స్ లేని హీరోలున్నారు ఇక్కడ. రాత్రంతా తాగడం, పొద్దున్నే అలాగే సెట్‌కి వచ్చేయడం. వాళ్ల పేర్లు నేను చెప్పలేను కానీ... వారితో రొమాంటిక్ సీన్స్‌లో చేయాల్సొచ్చినప్పుడు వాంతి వచ్చినంత పనయ్యేది. ఎంత ఓర్చుకునేదాన్నో ఆ దేవుడికి తెలుసు.
 
 ఈ సందర్భంలో సౌత్ హీరోల గురించి కచ్చితంగా ప్రస్తావించాలి. సెట్‌లో వాళ్లెంత హుందాగా ఉంటారో మాటల్లో చెప్పలేను. నీట్‌గా వస్తారు. పక్కన ఆర్టిస్ట్‌లను అస్సలు ఇబ్బందికి గురి చేయరు. వారి నుంచి బాలీవుడ్ హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కనీసం డియోడరెంట్ కొట్టుకొని రావాలనే ఇంగితం లేని వాళ్లు హీరోలు ఎలా అయ్యారో’’ అంటూ బాలీవుడ్ హీరోలను దుయ్యబట్టారు కత్రినా. ఇంతకీ కత్రినాని అంతగా ఇబ్బందులకు గురి చేసిన ఆ హీరోలు ఎవరో మరి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement