నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌తో వేడుక‌లు షురూ | Nithin Engaged With Shalini On July 22 | Sakshi
Sakshi News home page

నితిన్ ఇంట పెళ్లి సంద‌డి షురూ

Jul 22 2020 2:05 PM | Updated on Jul 22 2020 3:47 PM

Nithin Engaged With Shalini On July 22 - Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి సందడి షురూ అయింది. ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న పెళ్లి వేడుకలు నేటి నుంచే మొద‌ల‌య్యాయి. బుధ‌వారం హైద‌రాబాద్‌లో నితిన్ షాలినిల కుటుంబ పెద్ద‌లు ఇరువైపులా తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థం నిర్వ‌హించాయి. ప‌రిమిత అతిథుల మ‌ధ్య ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఎంగేజ్‌మెంట్‌తో ప్రారంభ‌మైన ఐదు రోజుల పెళ్లి సంబ‌రాలు ఆసాంతం కోవిడ్ నిబంధ‌న‌లు అనుస‌రిస్తూనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 26న రాత్రి ఎనిమిది గంట‌ల ముప్పై నిమిషాల‌కు షాలిని మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నారు. (కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌)

త‌న‌ పెళ్లికి వ‌చ్చి ఆశీర్వ‌దించాల్సిందిగా కోరుతూ నితిన్‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స్వ‌యంగా ఆహ్వానం అంద‌జేశారు. అలాగే సినీ ఇండ‌స్ట్రీలో త‌న గురువు అని చెప్పుకునే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోపాటు సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను పెళ్లికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానించారు. వీరి పెళ్లి ఏర్పాట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే ఆరంభ‌మైన విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలినిల ప‌సుపు, కుంకుమ వేడుక జ‌రిగింది. ఆ త‌ర్వాత పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో లాక్‌డౌన్ వ‌చ్చిప‌డింది. దీంతో ఆ శుభ‌కార్యం ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ఎట్టకేల‌కు నితిన్ పెళ్లి చేసుకుంటూ బ్యాచిల‌ర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్ట‌బోతున్నాడు. (మా పెళ్లికి రండి : కేసీఆర్‌కు ఆహ్వానం)

Advertisement
 
Advertisement
Advertisement