‘మా రైటర్స్‌ ప్రపంచం అంటే ఇంతే’ | Nani's Gang Leader Movie Trailer | Sakshi
Sakshi News home page

‘మా రైటర్స్‌ ప్రపంచం అంటే ఇంతే’

Aug 28 2019 11:16 AM | Updated on Aug 28 2019 12:50 PM

Nani's Gang Leader Movie Trailer - Sakshi

నేచురల్ స్టార్ నాని హీరోగా, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్ లీడర్. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వరుస వాయిదాల తరువాత సెప్టెంబర్ 13న రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని రివేంజ్‌ కథల రచయిత పెన్సిల్‌గా కనిపించనున్నాడు. రివేంజ్‌ రచయిత అయినా పెన్సిల్‌ ఐదుగురు ఆడవాళ్లు పగ తీర్చుకునేందుకు ఎలా సాయం చేశాడు అన్నదే గ్యాంగ్ లీడర్‌ కథ. నానికి జోడిగా ప్రియాంక అరుల్‌ మోహన్ నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలందిస్తున్నాడు. సీనియర్ నటి లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురివిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement