నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా? | Nani's Gang Leader To Get Postponed | Sakshi
Sakshi News home page

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

Jul 23 2019 1:29 PM | Updated on Jul 23 2019 1:29 PM

Nani's Gang Leader To Get Postponed - Sakshi

నేచురల్‌ స్టార్ నాని, విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్ లీడర్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సాహో సినిమాను అదే రోజు రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించటంతో గ్యాంగ్ లీడర్‌ టీం ఆలోచనలో పడ్డారు.

సాహో లాంటి భారీ చిత్రంలో పోటి పడే కన్నా రిలీజ్‌ వాయిదా వేయటం బెటర్‌ అన్న ఆలోచనలో ఉన్నారట. అందుకే ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు 30న కాకుండా సినిమాను సెప్టెంబర్‌ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నాని సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుథ్ సంగీతమందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement