గణితశాస్త్రంలోనే ఓ అద్భుత ఘట్టం: నాని | Nani tweets about 'Bhale Bhale Magadivoy' | Sakshi
Sakshi News home page

గణితశాస్త్రంలోనే ఓ అద్భుత ఘట్టం: నాని

Oct 23 2015 5:29 PM | Updated on Sep 3 2017 11:22 AM

గణితశాస్త్రంలోనే ఓ అద్భుత ఘట్టం: నాని

గణితశాస్త్రంలోనే ఓ అద్భుత ఘట్టం: నాని

హీరో నాని.. గణితశాస్త్రంలోనే ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందంటున్నారు. ఏంటీ.. నాని సినిమాలు మానేసి మళ్లీ చదువు బాట పట్టాడనుకుంటున్నారా.. అస్సలు కాదు.

హీరో నాని.. గణితశాస్త్రంలోనే ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందంటున్నారు. ఏంటీ.. నాని సినిమాలు మానేసి మళ్లీ చదువు బాట పట్టాడనుకుంటున్నారా.. అస్సలు కాదు. నాని మాట్లాడుతుంది సినిమా గురించే. తన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ 'భలే భలే మగాడివోయ్' గురించి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న 'భలే భలే మగాడివోయ్' విడుదలై నేటికి 50 రోజులయ్యింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో సినిమా విజయవంతంగా ఆడుతోంది. ఆ సంతోషాన్నే నాని ట్విట్టర్లో పంచుకున్నారు.

50 రోజులకు కూడా సినిమా దిగ్విజయంగా నడుస్తుందనే ఆనందంతో 'హౌ..ఆ.. హౌ? ఇది గణితశాస్త్రంలోనే ఓ అద్భుత ఘట్టం' అంటూ నాని తన స్టైల్లో ట్వీట్ చేశారు.'భలే భలే మగాడివోయ్' సినిమా హీరో నానికే కాదు, డైరెక్టర్ మారుతి కెరీర్లో కూడా బిగ్గెస్ట్ హిట్. లక్కరాజు అలియాస్ లక్కీ అనే ఓ మతిమరుపు మారాజు పాత్రలో నాని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ సినిమాతోనే నాని అభిమానులతో 'నేచురల్ స్టార్' అనిపించుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement