ముందు మనం మనుషులం: మంచు మనోజ్ | manchu manoj respond on Venu attack | Sakshi
Sakshi News home page

ముందు మనం మనుషులం: మంచు మనోజ్

Dec 23 2014 4:39 PM | Updated on Sep 2 2017 6:38 PM

ముందు మనం మనుషులం: మంచు మనోజ్

ముందు మనం మనుషులం: మంచు మనోజ్

కమెడియన్ 'జబర్దస్త్' వేణుపై జరిగిన భౌతికదాడిపై హీరో మంచు మనోజ్ స్పందించారు.

హైదరాబాద్: కమెడియన్ 'జబర్దస్త్' వేణుపై జరిగిన భౌతికదాడిపై హీరో మంచు మనోజ్ స్పందించారు. వేణుపై దాడిని చావకబారు, అమానవీయ చర్యగా ఆయన పేర్కొన్నారు. కుల, మతాల కంటే ముందు మనం మనుషులం అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.
ఈమేరకు తన ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టారు.

కమెడియన్ జబర్దస్త్ వేణుపై ఆదివారం ఫిల్మ్ నగర్లో గౌడ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. ఈటీవీలో ప్రసారమౌతున్న 'జబర్దస్త్' కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారన్న కోపంతో ఈ దాడికి పాల్పడ్డారు.

కమెడియన్‌ వేణుపై జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ తో పాటు పలువురు నటులు ఖండించారు. నవ్వులు పండిస్తున్న నటులను కొట్టడం అమానుషమని చిరంజీవి సోదరుడు నాగబాబు అన్నారు.
 

మంచు మనోజ్ ట్వీట్

Advertisement
 
Advertisement
Advertisement