ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా! : కత్తి | mahesh kathi commented on agnathavasi movie | Sakshi
Sakshi News home page

ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా!

Jan 4 2018 5:33 PM | Updated on Mar 22 2019 5:33 PM

mahesh kathi commented on agnathavasi movie - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి..  ‘అజ్ఞాత‌వాసి’ సినిమా డైరెక్టర్‌ త్రివిక్రమ్‌పై సోషల్‌ మీడియాలో కామెంట్లు పోస్ట్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ విడుదలయినపుడు అది ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వ‌చ్చేలా ఉందని,  2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా `లార్జో వించ్` అనే సినిమా ట్రైల‌ర్‌లా ఉందని త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.  అయితే తాజాగా ‘ త్రివిక్రమ్ కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలి అయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ళ కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా!!!’ అని పోస్ట్‌ పెట్టారు. 

పవన్‌ అభిమానులకు కత్తి హెచ్చరిక!
గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్‌, పవన్‌ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. ‘మీరు తిట్టే ప్రతి బూతు. కూసే ప్రతికూతా. చేసే ప్రతి కాల్. వచ్చే ప్రతి బెదిరింపు ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఘోరీ కట్టడానికి వాడతాను. గుర్తుపెట్టుకోండి.’ అని తాజాగా తన ఫేస్‌బుక్‌ వేదికగా కత్తి కామెంట్‌ చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement