శాటిలైట్‌ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’ | Mahesh Babu Sarileru Neekevvaru Rights Sold for a Bomb | Sakshi
Sakshi News home page

శాటిలైట్‌ బిజినెస్‌లోనూ ‘సరిలేరు నీకెవ్వరు’

Jun 25 2019 4:49 PM | Updated on Jun 25 2019 7:22 PM

Mahesh Babu Sarileru Neekevvaru Rights Sold for a Bomb - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఎఫ్‌ 2 సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ సాధించిన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా బిజినెస్‌ కూడా జరగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

మహేష్ క్రేజ్‌తో పాటు దర్శకుడు అనిల్‌ ట్రాక్‌ రికార్డ్ ను చూసి భారీ ఆఫర్లే వచ్చాయట.  ఫైనల్‌గా రూ.16.5 కోట్లకు సరిలేరు నీకెవ్వరు శాటిలైట్‌ హక్కులను సన్‌ నెట్‌వర్క్‌ సంస్థ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ గత చిత్రం మహర్షి శాటిలైట్‌ రైట్స్‌ రూ.12 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు  ఇంత భారీ మొత్తానికి అమ్ముడై మహేష్ కెరీర్‌ బెస్ట్‌ రికార్డ్‌ సాధించటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement