'ఈ నగరాన్ని వదిలివెళ్లడం చాలా కష్టం' | Leaving Kolkata will be tough: Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

'ఈ నగరాన్ని వదిలివెళ్లడం చాలా కష్టం'

Nov 18 2014 3:42 PM | Updated on Sep 2 2017 4:41 PM

'ఈ నగరాన్ని వదిలివెళ్లడం చాలా కష్టం'

'ఈ నగరాన్ని వదిలివెళ్లడం చాలా కష్టం'

షూజిత్ సర్కార్ తీస్తున్న 'పికు' సినిమా షూటింగ్ ముగిసిపోవడంతో కోల్కతా నగరాన్ని వదిలి వెళ్లాల్సి రావడం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు చాలా కష్టంగా అనిపిస్తోంది.

షూజిత్ సర్కార్ తీస్తున్న 'పికు' సినిమా షూటింగ్ ముగిసిపోవడంతో కోల్కతా నగరాన్ని వదిలి వెళ్లాల్సి రావడం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు చాలా కష్టంగా అనిపిస్తోంది. తన తొలినాళ్లలో ఈ నగరంలోనే గడిపిన ఆయన.. షూటింగ్ జరిగిన నెలరోజులూ నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. కోల్కతాలో ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసిపోవడంతో ఆయన తిరిగి ముంబై వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ''ఇలా వదిలి వెళ్లడం చాలా కష్టమే.. కానీ తప్పదు'' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమాలో ఆయన దీపికా పడుకొనే తండ్రి పాత్ర పోషిస్తున్నారు.

ఇంతకుముందు ప్రకాష్ ఝా తీసిన 'ఆరక్షణ్'లో కూడా ఆయన దీపికకు తండ్రిగానే చేశారు. పికు సినిమాకు అందించిన సహకారం చాలా బాగుందంటూ మమతా బెనర్జీకి దర్శకుడు షూజిత్ సర్కర్ ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఆశీర్వాదాలు లేకుండా ఈ షూటింగ్ జరిగేదే కాదన్నారు. అలాగే కోల్కతా ప్రజలు కూడా చాలా ప్రేమ కనబరిచారని, దాంతో తాము ఇంట్లో ఉన్నట్లే అనిపించిందని ట్వీట్ చేశారు. కోల్కతాలోని ప్రఖ్యాత రైటర్స్ బిల్డింగ్, హౌరా బ్రిడ్జి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఏప్రిల్ 30వ తేదీన ఇది విడుదల కావచ్చని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement