దారి చూపే పాట

KS Chithra and 22 other singers sing old Malayalam song to express solidarity - Sakshi

‘‘మనుషులందరూ సమస్యల కూడలిలో చిక్కుకున్నప్పుడు, ఎటు పోవాలో అర్థం కానప్పుడు ఓదార్పుగా, కొంతసేపు ఉపశమనంగా ఉండేందుకు, స్ఫూర్తి నింపేందుకు, దారి చూపేందుకు పాట ఉపయోగపడుతుంది’’ అంటున్నారు ప్రముఖ గాయకురాలు కేయస్‌ చిత్ర. ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనాతో పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి  స్ఫూర్తి నింపడానికి కళాకారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కేయస్‌ చిత్ర కూడా ఓ పాటను పాడి, రిలీజ్‌ చేశారు.

1972లో మలయాళ చిత్రం ‘స్నేహదీపమే మిళి తురక్కు’లో జానకి పాడిన ‘లోకం ముళువన్‌ సుగం పకరనాయి...’ అంటూ సాగే పాటను ఈ సందర్భంగా కొత్తగా ఆలపించారు చిత్ర.  ఆమెతో పాటు 22 మంది గాయకులు (సుజాత, కావాలం శ్రీ కుమార్, షరత్, శ్రీరామ్, ప్రీత, శ్వేతా, సంగీత, విదు ప్రతాప్, రిమి టామీ, అఫ్జల్, జ్యోత్స్న, నిషాద్, రాకేష్, టీను, రవిశంకర్, దేవానంద్, రేంజిని జోస్, రాజ్య లక్ష్మి, రమేష్‌ బాబు, అఖిలా ఆనంద్, దివ్యా మీనన్, సచిన్‌ వారియర్‌ )  గొంతు కలిపారు.  ఈ పాటలోని ఒక్కో వాక్యాన్ని ఒక్కో సింగర్‌ పాడి, రికార్డ్‌ చేసి, వీడియో రూపంలో రిలీజ్‌ చేశారు. ‘‘కరోనా వైరస్‌ పూర్తిగా అంతం అయిపోవాలని, మళ్లీ ప్రపంచమంతా శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో ఈ పాటను దేవుడికి ప్రార్థన గీతంలా పాడాం’’ అని పేర్కొన్నారు చిత్ర.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top