కిడ్నాప్ డ్రామా | Kidnapping drama | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ డ్రామా

Jul 15 2014 12:21 AM | Updated on Sep 2 2017 10:17 AM

కిడ్నాప్ డ్రామా

కిడ్నాప్ డ్రామా

‘‘ఈ సినిమా ఐడియా నాకు బాగా నచ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో నటీనటులు కాకుండా నేను, అల్లరి నరేశ్, ప్రిన్స్‌తో పాటు ఏడుగురు నటించిన పెద్ద మల్టీస్టారర్ ఇది’’

 ‘‘ఈ సినిమా ఐడియా నాకు బాగా నచ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో నటీనటులు కాకుండా నేను, అల్లరి నరేశ్, ప్రిన్స్‌తో పాటు ఏడుగురు నటించిన పెద్ద మల్టీస్టారర్ ఇది’’ అని హీరో నాని అన్నారు. నందు, ఆదర్శ్, భూపాల్, పూనమ్‌కౌర్, శ్రద్ధాదాస్ ముఖ్య తారలుగా సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో లక్కీ క్రియేషన్స్ పతాకంపై చందు పెన్మత్స నిర్మిస్తున్న ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
 
 పాటల సీడీని హీరో శ్రీకాంత్ ఆవిష్కరించి, తొలి ప్రతిని ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డికి అందించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఊహించని సంఘటనల వల్ల చిక్కుల్లో పడిన ముగ్గురు యువకులు సూపర్‌స్టార్ మహేశ్‌బాబును కిడ్నాప్ చేయాలనుకుంటారు. వారు చేసిన ప్లాన్ ప్రకారం కిడ్నాప్ జరిగిందా లేదా అనేది తెరపైనే చూడాలి’’ అని చెప్పారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేశానని నందు తెలిపారు. ఈ కార్యక్రమంలో రానా, సుదీప్, తనీష్, నిఖిల్, ఖయ్యూమ్, వరుణ్ సందేశ్, ప్రిన్స్, శ్రీనివాస్ అవసరాల, సాయికార్తీక్, శశాంక్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement