రాకీ భాయ్‌ ఈజ్‌ బ్యాక్‌ | kgf second part first look release | Sakshi
Sakshi News home page

రాకీ భాయ్‌ ఈజ్‌ బ్యాక్‌

Dec 23 2019 12:29 AM | Updated on Dec 23 2019 12:29 AM

kgf second part first look release - Sakshi

‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 1’ సినిమా మాస్‌ ప్రేక్షకులకు విందు భోజనం అందించింది. రెండో పార్ట్‌కోసం ఈ సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌ పార్ట్‌ విడుదలైన మొదటి వార్షికోత్సవానికి సెకండ్‌ పార్ట్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసింది చిత్రబృందం. యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కైకాల సత్యనారాయణ సమర్పణలో విజయ్‌ కిర గందూర్‌ నిర్మిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి కథానాయిక. సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నారు. యష్‌ చేసిన రాకీ భాయ్‌ పాత్రకు మంచి ఆదరణ లభించింది. ‘సామ్రాజ్యాన్ని సరికొత్తగా నిర్మిస్తూ’ అనే క్యాషన్‌తో విడుదలైన ఈ ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement