అది నిజం కాదు

Janhvi Kapoor to romance Sidharth Malhotra in Dostana 2? - Sakshi

బాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్‌ని పరిచయం చేయడంలో లక్కీ హ్యాండ్‌ అంటే కరణ్‌ జోహార్‌ అనే చెప్పాలి. ఆయన ఇంట్రడ్యూస్‌ చేసిన యాక్టర్స్‌ అందరూ సూపర్‌ సక్సెస్‌లో కొనసాగుతున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని కూడా ఆయనే పరిచయం చేశారు. ఫస్ట్‌ సినిమా ‘ధడక్‌’లో అవకాశం ఇవ్వడమే కాదు... వెంటనే పీరియాడికల్‌ డ్రామా ‘తక్త్‌’లోనూ అవకాశం ఇచ్చారు. సెకండ్‌ సినిమాతోనే అనిల్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్‌ , కరీనా కపూర్‌ వంటి స్టార్స్‌తో కలిసి యాక్ట్‌ చేసే అవకాశం రావడం అంటే జాన్వీ లక్కీయనే చెప్పాలి.

ఫస్ట్‌ సినిమా ద్వారా ఇండస్ట్రీకు పరిచయం చేసిన కరణ్‌ తర్వాత సినిమాలు కూడా ఆఫర్‌ చేస్తూ జాన్వీ ఇండస్ట్రీలో నిలబడటానికి ఒక  గైడ్‌లా హైల్ప్‌ చేస్తున్నారు. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్‌ జాన్వీకి కరణ్‌ ఇచ్చారని బాలీవుడ్‌ టాక్‌. 2008లో తరుణ్‌ మన్‌సుఖానీ రూపొందించిన ‘దోస్తానా’ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించే పనిలో ఉన్నారాయన. ఇందులో హీరోయిన్‌గా జాన్వీని ఫిక్స్‌ చేసినట్టు వార్త షికారు చేస్తోంది. ఈ వార్తల్లో నిజం లేదని కరణ్‌ స్పష్టం చేశారు. సో.. జాన్వీ మూడో సినిమా బయట ప్రొడక్షన్‌లో ఉంటుందా? లేదా తండ్రి బోనీ కపూర్‌తో ఉంటుందా తెలియాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top