వీర ప్రేమ! | It's Crucial Film For Nani | Sakshi
Sakshi News home page

వీర ప్రేమ!

Jan 31 2016 11:11 PM | Updated on Sep 3 2017 4:42 PM

వీర ప్రేమ!

వీర ప్రేమ!

మహాలక్ష్మి అంటే కృష్ణకు బోల్డంత ప్రేమ. ఆమె ప్రేమ దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతాడు.

మహాలక్ష్మి అంటే కృష్ణకు బోల్డంత ప్రేమ. ఆమె ప్రేమ దక్కించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అంత వీర ప్రేమ అన్నమాట. ఇంతకీ మహాలక్ష్మి ప్రేమను దక్కించుకోవడానికి కృష్ణ ఏం చేశాడు? అనే కథాంశంతో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’. ఈ నెల 12న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర మాట్లాడుతూ -‘‘ఇటీవల హీరో మహేశ్‌బాబు విడుదల చేసిన మా చిత్రం పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. కృష్ణగా నాని, మహాలక్ష్మిగా మెహరిన్ నటన అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ విధంగా ఈ ప్రేమకథ ఉంటుంది. ప్రముఖ ఛాయాగ్రహకుడు రత్నవేలు శిష్యుడు యువరాజ్ కెమెరా పనితనం ఈ చిత్రానికి హెలైట్ అవుతుంది. తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది’’ అని తెలిపారు. సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృధ్వీ, హరీశ్ ఉత్తమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, లైన్ నిర్మాత: హరీశ్ కట్టా.

Advertisement
 
Advertisement
Advertisement