బొమన్ ఇరానీ పాత్రలో..! | In the role of boman Irani ..! | Sakshi
Sakshi News home page

బొమన్ ఇరానీ పాత్రలో..!

Jun 17 2015 11:27 PM | Updated on Sep 3 2017 3:53 AM

బొమన్ ఇరానీ పాత్రలో..!

బొమన్ ఇరానీ పాత్రలో..!

ఇప్పటివరకూ ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేసి, విలక్షణ నటుడనిపించుకున్న ప్రకాశ్‌రాజ్ ఇప్పుడు హిందీ చిత్రం ‘జాలీ ఎల్.ఎల్.బి’ రీమేక్‌లో మరో వైవిధ్యమైన పాత్ర చేయనున్నారు.

ఇప్పటివరకూ ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేసి, విలక్షణ నటుడనిపించుకున్న ప్రకాశ్‌రాజ్ ఇప్పుడు హిందీ చిత్రం ‘జాలీ ఎల్.ఎల్.బి’ రీమేక్‌లో మరో వైవిధ్యమైన పాత్ర చేయనున్నారు. ఈ చిత్రం అంగీకరించిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకాశ్‌రాజ్ ధృవీకరించారు.
 
 అయితే, ఏ పాత్ర చేయనున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అర్షద్ వార్షీ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకుంది.
 
 అహ్మద్ దర్శకత్వంలో ఈ చిత్రం తమిళంలో పునర్నిర్మితం కానుంది. హిందీలో బొమన్ ఇరానీ చేసిన పాత్రను  తమిళంలో ప్రకాశ్‌రాజ్, అర్షద్ వార్షీ పాత్రను ఉదయనిధి స్టాలిన్ చేయనున్నారని సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement