బాలయ్య సినిమాలో హాలీవుడ్ విలన్ | Hollywood Star Nathan Jones To Join Gauthamiputra Satakarni | Sakshi
Sakshi News home page

బాలయ్య సినిమాలో హాలీవుడ్ విలన్

Jul 8 2016 11:20 AM | Updated on Sep 4 2017 4:25 AM

బాలయ్య సినిమాలో హాలీవుడ్ విలన్

బాలయ్య సినిమాలో హాలీవుడ్ విలన్

నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం...

నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం విదేశాల్లో మరో భారీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో సినిమాకు సంబందించిన మరో వార్త నందమూరి అభిమానుల్లో జోష్ పెంచుతోంది.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్యతో ఓ హాలీవుడ్ విలన్ ఢీ కొనబోతున్నాడు. ట్రాయ్ సినిమాలో నటించిన ఇంగ్లీష్ వినల్ నూతన్ జోన్స్ బాలయ్య సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రపంచాన్ని జయించాలన్న ఆశయంతో వరుస దండయాత్రలు చేసే గ్రీకు రాజుగా కనిపించనున్నాడు జోన్స్. ప్రస్తుతం జార్జీయాలో జరుగుతున్న షెడ్యూల్ లోనే నూతన్ జోన్స్తో యుద్ద సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement