హలో గురు ప్రేమకోసమే ఫస్ట్‌ లుక్‌

Hello Guru Prema Kosame Movie First Look Out - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’.. ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది. దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన‌ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. రామ్‌ బర్త్‌ డే సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ను వదిలారు. అనుపమ వెనకాల ఫాలో అవుతున్న రామ్‌.. స్టైలిష్‌గా ఫస్ట్‌ లుక్‌ను వదిలారు. ఎస్వీసీ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంతో ఆకట్టుకున్న రామ్‌ మరోసారి ప్రేమకథతోనే రాబోతున్నట్లు స్పష్టమౌతోంది. సెప్టెంబర్‌లో హలో గురు ప్రేమకోసమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top