కుటుంబ సమేతంగా..‘హలో గురు..’ | Hello Guru Prema Kosame Movie Censor Completed | Sakshi
Sakshi News home page

Oct 15 2018 8:03 PM | Updated on Oct 15 2018 8:13 PM

Hello Guru Prema Kosame Movie Censor Completed - Sakshi

ఈ రోజుల్లో సెన్సార్‌బోర్డు నుంచి యు సర్టిఫికెట్‌ను పొందడం సాధారణ విషయం కాదు. చాలా మంది దర్శక, నిర్మాతలు యు/ఏ సర్టిఫికెట్‌ వస్తే చాలు అనుకునే పరిస్థితి. అలాంటిది సింగిల్‌ కట్‌ లేకుండా.. క్లీన్‌ ‘యూ’ సర్టిఫికేట్‌ అందుకుంది. ఎనర్జిటిక్ హీరో రామ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా దర్శ‌కుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘హలో గురు ప్రేమకోసమే’..  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సెన్సార్‌ క్లీన్‌ ‘యూ’ సర్టిఫికేట్‌ జారీ చేసింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు సభ్యులు ‘యూ’ సర్టిఫికెట్‌ను అందంచడంతో పాటు సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే మంచి కథా చిత్రం అంటూ కితాబు కూడా ఇచ్చారట. 

‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత రామ్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి ఈ మూవీ కోసం జోడి కట్టారు. ప్రకాష్ రాజ్, పోసాని ఇంపార్టెంట్ రోల్స్ ప్లే  చేశారు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకువస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘నేను శైలజ’చిత్రం తర్వాత భారీ హిట్‌ లేక సతమతమవుతున్న రామ్‌ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్రయూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. రీసెంట్‌గా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ మూవీకి సెన్సార్ వాళ్లు ఒక కట్ చెప్పకుండా.. క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement