‘సింగం’ కాంబోలో మరో మూవీ | Director Hari Next Movie Suriya | Sakshi
Sakshi News home page

Oct 13 2018 3:21 PM | Updated on Oct 13 2018 6:08 PM

Director Hari Next Movie Suriya - Sakshi

సౌత్‌ స్టార్‌ హీరో సూర్య, యాక్షన్‌ చిత్రాల దర్శకుడు హరి కాంబినేషన్‌లో వచ్చిన సింగం సిరీస్‌ ఎంతటి ఘనవిజయం సాదించిందో తెలిసిందే. ఈ సిరీస్‌లో మూడు భాగాలు వచ్చిన సినిమాలు తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ కాంబినేషన్‌ మరో రిపీట్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవల విక్రమ్‌ హీరోగా సామి స్క్వేర్‌ సినిమాను తెరకెక్కించిన హరి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో తన తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే సూర్యకు లైన్‌ చెప్పిన హరి ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. అయితే ఈ కాంబినేషన్‌లో రాబోయే సినిమా సింగంకు కొనసాగింపు కాదని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement