ధనలక్ష్మితో డీల్! | deal with dhanalaxmi | Sakshi
Sakshi News home page

ధనలక్ష్మితో డీల్!

Mar 4 2016 11:10 PM | Updated on Sep 3 2017 7:00 PM

ధనలక్ష్మితో డీల్!

ధనలక్ష్మితో డీల్!

సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘డీల్ విత్ ధనలక్ష్మి’. మానస్, పూజిత, అంజలి, అర్చన, విజయభాస్కర్ రెడ్డి, సత్య ప్రధాన పాత్రల్లో వెంకట్ ప్రసాద్

సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘డీల్ విత్ ధనలక్ష్మి’. మానస్, పూజిత, అంజలి, అర్చన, విజయభాస్కర్ రెడ్డి, సత్య ప్రధాన పాత్రల్లో వెంకట్ ప్రసాద్ (బాబీ) దర్శకత్వంలో ఏవీయస్ శ్రీనివాస్, కవిత సింహాచలం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇది పదిమంది కోసం పాటుపడే యువకుడి కథ . వినోద ప్రధానంగా నడిచే సస్పెన్స్ థ్రిల్లర్’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ నెల 10 నుంచి 30 వరకూ రాజమండ్రి, తాపేశ్వరం, సిద్దాంతం ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ చేస్తాం. ఏప్రిల్ 7 నుంచి 25 వరకూ హైదరాబాద్‌లో జరిపే రెండో షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డా. జోశ్యభట్ల, కెమేరా: ఏవీ శ్రీనివాస్(బాబు).

Advertisement
 
Advertisement
Advertisement