'కేజీఎఫ్‌' అభిమానుల‌కు షాక్‌! వ‌చ్చే ఏడాదికి..

Corona: KGF Chapter 2 Release To Be Postponed To 2021 - Sakshi

క‌రోనా వైర‌స్ దేశ వాసుల ప్రాణాలపై‌ ఏమాత్రం కనికరం చూపడంలేదు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్న‌ప్ప‌టికీ ఈ మ‌హ‌మ్మారి మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన  విష‌యం తెలిసిందే.  క‌రోనా ప్ర‌భావం సినిమా షూటింగ్‌ల‌పై మాత్ర‌మే కాకుండా.. విడుద‌ల తేదీలపై కూడా ప‌డింది. దీంతో ఏ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కేజీఎఫ్‌-2 సినిమా విడుద‌ల తేదీని వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది. (ఫైట్స్‌ బ్యాలెన్స్‌ గురూ)

ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు 23న విడుద‌ల చేయాల‌నుకున్న 'కేజీఎఫ్: చాప్ట‌ర్‌2'ను 2021కి వాయిదా వేస్తున్న‌ట్లు స‌మాచారం. దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న నేప‌థ్యంలో కేజీఎఫ్‌-2 సినిమా షూటింగ్ సైతం ఆగిపోయింది. దీంతో తిరి‌గి చిత్రీక‌ర‌ణ ఎప్పుడు ప్రారంభం అవుతుంద‌నేది తెలియ‌క‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం వెలువడాల్సి ఉంది.  శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్, రవీనా టాండన్, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2018లో వచ్చిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌1’ చిత్రానికి సీక్వెల్‌ అయిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుద‌ల కానుంది. ('ఆయ‌న మ‌ర‌ణం తీర‌ని లోటు') 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top