అందుకే కట్ చేశా | Cold War to trisha and railakshmi | Sakshi
Sakshi News home page

అందుకే కట్ చేశా

Mar 27 2015 2:36 AM | Updated on Sep 2 2017 11:26 PM

అందుకే కట్ చేశా

అందుకే కట్ చేశా

నటి త్రిషతో స్నేహాన్ని కట్ చేసుకోవడానికి కారణమేమిటన్న ప్రశ్నకు నటి రాయ్‌లక్ష్మి చెప్పిన బదులేమిటో తెలుసా?

నటి త్రిషతో స్నేహాన్ని కట్ చేసుకోవడానికి కారణమేమిటన్న ప్రశ్నకు నటి రాయ్‌లక్ష్మి చెప్పిన బదులేమిటో తెలుసా? అసత్యాలు ఆమెకు నచ్చవట. వీరి సంగతేమిటో చూద్దాం. త్రిష, రాయ్‌లక్ష్మి ఒకప్పుడు మంచి స్నేహితులు. అలాంటి స్నేహం ఇప్పుడిద్దరి మధ్య లేదట. ఇటీవల సౌకారపేట చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాయ్‌లక్ష్మి విలేకరులతో ముచ్చటిస్తూ ప్రస్తుతం హాస్యంతో కూడిన హార్రర్ చిత్రాలకు ప్రేక్షకులు నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ సౌకారపేట చిత్రం ఆ కోవలోకే వస్తుందని చెప్పారు. అరణ్మణై చిత్రం తరువాత తానీ దెయ్యం ఇతివృత్తంతో కూడిన చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. మధ్యలో తానెక్కడికో పారిపోయినట్లు బోలెడు కథలల్లేస్తూ ప్రచారం చేశారన్నారు. నిజానికి నచ్చిన పాత్రలు లభించకపోవడంతో దొరికిన ఖాళీ సమయాన్ని న్యూజిల్యాండ్‌లో స్కై డైయింగ్, స్కూచ్ డైయింగ్ లాంటి క్రీడలో శిక్షణ పొందడానికి వెచ్చించానని వివరించారు.

తనకు నటి త్రిష మధ్య కోల్డ్‌వార్‌కు కారణం ఏమిటని అడుగుతున్నారన్నారు. నాకు అసత్యాలాడే వారంటే నచ్చరని పేర్కొన్నారు. మొదట్లో త్రిష తాను చాలా ఫ్రెండ్లీగా ఉండేవారమని చెప్పారు. విందులు, వినోదాలకు కలిసే పాల్గొనేవారమని అలాంటి తనతో అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అయితే ఈ విషయమై తాను పూర్వాపరాల జోలికి వెళ్లదలచుకోలేదని రాయ్‌లక్ష్మి అన్నారు.
 వాళ్లను ఉరి తీయాలి: ఇంటర్‌నెట్‌లో తారల ఫొటోలను మార్ఫింగ్ చేసి బాత్‌రూమ్ సన్నివేశాలను ప్రచారం చేసే సంస్కృతి అధికం అవుతోందన్నారు. తారపై ద్వేషంతోనే కొందరు ఇలాంటి నీచ కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. తన ఫొటోలతో కూడిన బాత్రూమ్ సన్నివేశాలు ఇటీవల ఇంటర్‌నెట్‌లో హల్ చల్‌చేశాయన్నారు. ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదని, ఇంకా చెప్పాలంటే బతకనీయరాదని అన్నారు. దుబాయ్‌లోని చట్టాలను తీసుకొచ్చి వారిని ఉరేయాలని రాయ్‌లక్ష్మి మండిపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement