వెంటపడి ప్రేమిస్తా | chit chat with siva karthi keyan | Sakshi
Sakshi News home page

వెంటపడి ప్రేమిస్తా

Mar 4 2014 11:41 PM | Updated on Aug 20 2018 3:40 PM

వెంటపడి ప్రేమిస్తా - Sakshi

వెంటపడి ప్రేమిస్తా

ప్రతి ఒక్కరూ కలెక్టర్ కావాలనో, పోలీసు అధికారి కావాలనో లేక హీరో కావాలనో లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటిది వెంటపడి మరీ ప్రేమించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక యువకుడి ఇతివృత్తమే మాన్ కరాటే అంటున్నారు ఆ చిత్ర హీరో శివకార్తికేయన్.

 ప్రతి ఒక్కరూ కలెక్టర్ కావాలనో, పోలీసు అధికారి కావాలనో లేక హీరో కావాలనో లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటిది వెంటపడి మరీ ప్రేమించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక యువకుడి ఇతివృత్తమే మాన్ కరాటే అంటున్నారు ఆ చిత్ర హీరో శివకార్తికేయన్. ఈయన అందాల భామ హన్సికతో తొలిసారిగా రొమాన్స్ చేసిన ఈ చిత్రం గురించి ఆయనతో మినీ ఇంటర్వ్యూ.
 
 ప్రశ్న : మాన్ కరాటేను పూర్తి ప్రేమ కథా చిత్రమా?

 
 జవాబు : ఇందులో ప్రేమ, హాస్యం, సెంటిమెంట్ అన్ని అంశాలు ఉంటాయి. తన స్థాయికి మించిన అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమించేసి ఆమెను వెంటపడి మరీ ప్రేమించే అబ్బాయి ఇతివృత్తం మాన్ కరాటే. ఆమె ప్రేమ కోసం ఎలాంటి హద్దులైనా దాటడానికి సిద్ధపడే యువకుడి చిత్రం. ఇలా ఈజీగా చెప్పేసినా చిత్రంలో చిన్న చిన్న ట్విస్టులు చాలా ఉన్నాయి. ఇది దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ అందించిన కథ అన్నది గమనార్హం.
 
 ప్రశ్న : చిత్రంలో పూర్తిగా మోడ్రన్ గెటప్‌కు మారారే?
 
 జవాబు : ఇంతకు ముందు గ్రామీణ, లేదా చిన్న నగరాల నేపథ్యంలో సాగే కథలలో నటించాను. ఎదుర్‌నీచ్చిల్ చిత్రం సిటీ నేపథ్యం కథాంశం అయినా రెగులర్ కుర్రాడిగానే నటించాను. దానికంటే పక్కా సిటీ నేపథ్య కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం మాన్‌కరాటే. మోడ్రన్ కుర్రాడిగా నన్ను మార్చడానికి దర్శకుడు తిరుకుమరన్ చాలా కష్టపడ్డారు.
 
 ప్రశ్న : హన్సికతో జతకట్టిన అనుభవం గురించి?
 
 జవాబు : నటి హన్సిక చాలా జాలీగా ఉండే యువతి. కథ చెప్పినప్పుడు హన్సిక లాంటివారు హీరోయిన్‌గా ఉంటారని చెప్పారు. అనూహ్యంగా ఆమెనే ఎంపిక చేశారు. అన్ని క్రీడలపైనా ఆసక్తి గల పాత్ర ఆమెది. వయసులో నా కంటే చిన్నదే అయినా గొప్పింటి అమ్మాయి కావడంతో జీజీ అని పిలుస్తాను. హన్సికది చాలా వెయిట్ ఉన్న పాత్ర. ఉదయం ఏడు గంటలకు షూటింగ్ అంటే మేమంతా ట్రాపిక్ చేధించుకుని స్పాట్‌కు చేరేసరికి ఎనిమిది గంటలవుతుంది. హన్సిక మాత్రం 6.30 గంటలకే స్పాట్‌లో ఉంటారు. ఆమెను చూస్తూ ఆశ్చర్యం కలిగిన విషయం అదే.
 
 ప్రశ్న : 2013లో మీరు నటించిన కేడీ బిల్లా కిల్లాడి రంగా, వరుత్త పడాదే వాలిబర్ సంఘం, ఎదిర్‌నీచ్చల్ అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించారా?
 
 జవాబు : హిట్ అవ్వాలనే పరిశ్రమలోని వారందరూ పోరాడుతారు. నేను విజయం సాధిస్తాననే ఆశించాను. అయితే ఇంత ఘన విజయం సాధిస్తామని ఊహించలేదు. వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రంలో ఉదా కలారు రిబ్బన్ అనే పాట తమిళనాడులో ఇప్పటికీ ఏదో ఒక మారుమూల మారుమోగుతూనే ఉంటుంది. చిత్రాలు వస్తుంటాయి పోతుంటాయి పాటలు మాత్రం ఎప్పటికీ మనల్ని గుర్తు చేస్తుండటం విశేషం. ఇటీవల పుదుచ్చేరిలో మాన్‌కరాటే చిత్ర షూటింగ్ జరుగుతుండగా అక్కడ కొచ్చిన ఒక బామ్మ ఉదాకలరు రిబ్బన్ అంటూ రంగు రంగుల బనియన్లు ధరించి పాడిన అబ్బాయివి నువ్వేగా అంటూ అడగడంతో ఆశ్చర్యపోవడం నావంతయ్యింది. ఆ పాట అంతగా రీచ్ అవ్వడం సాధారణ విషయం కాదు.
 

Advertisement
 
Advertisement
Advertisement