వార్‌ బిగిన్స్‌ | Sakshi
Sakshi News home page

వార్‌ బిగిన్స్‌

Published Wed, Jun 13 2018 12:37 AM

Chiranjeevi to works with Greg Powell for Sye Raa - Sakshi

అదో పెద్ద బ్రిటీష్‌ కోట. తెలుగు జాతిపై దాడి చేసేందుకు ఆయుధాలను దాచిపెట్టారు బ్రిటీష్‌ సైనికులు. విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి వారిపై దండయాత్ర చేశారు. బ్రిటీష్‌ సైనికుల్ని మట్టుబెట్టి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు... ప్రస్తుతం ఈ సన్నివేశాలను ‘సైరా’ చిత్రం కోసం చిత్రీకరిస్తున్నారట. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా’. నయనతార, తమన్నా కథానాయికలు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ప్రస్తుతం కోట సెట్‌లో చిరంజీవిపై పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ని ప్రముఖ హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌ గ్రెగ్‌ పావెల్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. ‘జేమ్స్‌బాండ్‌’ సిరీస్‌లో వచ్చిన ‘స్కై ఫాల్‌’, ‘హ్యారీపోట్టర్‌’ సిరీస్‌లో కొన్ని చిత్రాలకు, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ చిత్రాలకు యాక్షన్‌ సీక్వెన్సులు కంపోజ్‌ చేశారు పావెల్‌. ‘సైరా’ లోని యుద్ధ సన్నివేశాలను బ్రహ్మాండంగా డిజైన్‌ చేస్తున్నారట. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, బ్రహ్మాజీ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement