కొరియోగ్రాఫర్‌లకు చిరు షరతులు | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 27 2018 12:49 PM

Chiranjeevi Asked Choreographers Not to Include Heavy Dance Moves - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో చిరు మార్క్‌ డాన్స్‌ మూమెంట్స్‌ ఉండవన్న టాక్‌ వినిపిస్తోంది.
 

పీరియాడిక్‌ సినిమా అది కూడా స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత చరిత్ర కావటంతో అనవసరమైన డ్యాన్స్‌లు బాగుండవన్న భావనలో ఉన్నడాట చిరు. అందుకే హుందాగా ఉండేలా పాటలను ప్లాన్‌ చేయాలని కొరియోగ్రాఫర్లకు సూచించినట్టుగా తెలుస్తోంది. చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, తమన్నా, సుధీప్‌, విజయ్‌ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లోనటిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement