''దిల్‌వాలే'తో నా ఎఫైర్ ముగిసిపోయింది' | Boman Irani's 'affair' with 'Dilwale' ends | Sakshi
Sakshi News home page

''దిల్‌వాలే'తో ఎఫైర్ ముగిసిపోయింది'

Oct 31 2015 4:22 PM | Updated on Apr 3 2019 6:23 PM

''దిల్‌వాలే'తో నా ఎఫైర్ ముగిసిపోయింది' - Sakshi

''దిల్‌వాలే'తో నా ఎఫైర్ ముగిసిపోయింది'

'సినిమా నిర్మాణమంటేనే ఒక ఎఫైర్ లాంటింది. ఆ ఎఫైర్‌ను సమాజం కూడా అంగీకరిస్తుంది. కానీ అది ముగిసిపోవడం ఎంతైనా బాధాకరమే. 'దిల్‌వాలే'లో నా వంతు షూటింగ్ ముగిసిపోయింది'

ముంబై: 'సినిమా నిర్మాణమంటేనే ఒక ఎఫైర్ లాంటింది. ఆ ఎఫైర్‌ను సమాజం కూడా అంగీకరిస్తుంది. కానీ అది ముగిసిపోవడం ఎంతైనా బాధాకరమే. 'దిల్‌వాలే'లో నా వంతు షూటింగ్ ముగిసిపోయింది' అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు బొమన్ ఇరానీ. బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరొందిన ఆయన ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్, కాజోల్ జంటగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న 'దిల్‌వాలే' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తయిందని ఆయన శుక్రవారం రాత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 18న విడుదలకానుంది. బాలీవుడ్ బెస్ట్ స్క్రీన్ కపుల్‌గా పేరొందిన షారుఖ్, కాజోల్ ఐదేళ్ల తర్వాత ఈ సినిమాలో మళ్లీ జత కట్టడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో వరుణ్ ధావన్, కృతి సనన్ కూడా నటిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement