బాలీవుడ్‌ బ్యూటీ ఆమేనట | bollywood beauty shruti hassan | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ బ్యూటీ ఆమేనట

Jun 6 2017 8:27 PM | Updated on Sep 5 2017 12:57 PM

బాలీవుడ్‌లో కత్రినాకైఫ్, ప్రియాంకచోప్రా, దీపికాపడుకొనే లాంటి ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు.

చెన్నై: బాలీవుడ్‌లో కత్రినాకైఫ్, ప్రియాంకచోప్రా, దీపికాపడుకొనే లాంటి ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అయితే వారందనీ వెనక్కునెట్టి బాలీవుడ్‌ బ్యూటీ క్రెడిట్‌ను మాత్రం శ్రుతీహాసన్‌ కొట్టేశారు. ఈమెకు అందాలరాశి పట్టం కట్టింది ప్రముఖ బాలీవుడ్‌ విమర్శకుడు, నటుడు కేఆర్‌కే(కమాల్‌ ఆర్‌ ఖాన్‌). సినిమాలను సీన్‌ బై సీన్‌ తన విమర్శలతో చీల్చి చండాడే ఈయన సాధారణంగా ఎవరినీ ప్రశంసించరట. అలాంటిది తనకు నచ్చిన బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ అనీ, ఆమె చాలా అందగత్తె అనీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే శ్రుతిలో చిన్న లోపాన్ని కూడా కేఆర్‌కే వెల్లడించారు. ఆమెకు మంచి చిత్రాలను ఎంపిక చేసుకోవడం తెలియడం లేదని అన్నారు. ఆయన శ్రుతీహాసన్‌ను బాలీవుడ్‌ బ్యూటీగా పేర్కొనడం అక్కడి ప్రముఖులను సైతం విస్మయానికి గురి చేసిందట.

ఇక కేఆర్‌కే ట్వీట్‌కు అభిమానులు బాగానే రియాక్ట్‌ అవుతున్నారు. ఒక అభిమాని స్పందిస్తూ.. ‘శ్రుతీహాసన్‌ బాలీవుడ్‌ బ్యూటీ అనడాన్ని ఆహ్వానిస్తున్నా, అయితే ఆమెకు మంచి చిత్రాలను ఎంచుకోవడం తెలియదనడాన్ని అంగీకరించబోమ’ని అన్నారు. ఈ నెల 9వ తేదీన విడుదల కానున్న బీహెటీ(బెహాన్‌ హోగి తేరి) చిత్రం చూసిన తరువాత కేఆర్‌కే కచ్చితంగా తన అభిప్రాయాన్ని మార్చుకుంటారని అన్నాడు. ఇక బాలీవుడ్‌ బ్యూటీ అన్న విషయాన్ని చాలా మంది అభిమానులు అంగీకరిస్తున్నారు. మొత్తం మీద ఈ అందగత్తె ఇటీవల సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగి పతాక శీర్షికల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement