తమిళ తెరకు దారి! | Attarintiki daredi to remake in tamil | Sakshi
Sakshi News home page

తమిళ తెరకు దారి!

Jul 31 2018 2:26 AM | Updated on Jul 6 2019 3:48 PM

Attarintiki daredi to remake in tamil - Sakshi

నదియా

తెలుగులో హిట్టయిన ‘100% లవ్‌’, ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాలు తమిళంలో రీమేక్‌ అవుతున్నాయి. ఇప్పుడీ దారిలో మరో సినిమా చేరింది. ఆ సినిమా ‘అత్తారింటికి దారేది’. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ దక్కించుకుంది.

నవంబర్‌ 29న విడుదల కానున్న రజనీకాంత్‌ ‘2.0’ని నిర్మించింది లైకానే. ఇంకా పలు భారీ చిత్రాలను నిర్మించడంతో పాటు విడుదల కూడా చేస్తుంటుంది. ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌లో హీరోగా ఎవరు నటిస్తారు? అనేది ఇంకా ఫైనలైజ్‌ చేయలేదని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అత్త పాత్రకు మాత్రం నదియానే తీసుకుంటారని ఊహించవచ్చు. ఎందుకంటే తెలుగు వెర్షన్‌లో అత్త పాత్రను ఆమె బ్రహ్మాండంగా చేసిన విషయం సినిమా చూసినవారికి గుర్తుండే ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement