ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఆమ్రపాలి డ్యాన్స్‌ | Amrapali Dubey Belly Dance Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఆమ్రపాలి డ్యాన్స్‌

Jul 11 2018 12:57 PM | Updated on Jul 11 2018 1:07 PM

Amrapali Dubey Belly Dance Video Viral On Social Media - Sakshi

ఇంటర్నెట్‌లో దుమ్మరేపుతున్న ఆమ్రపాలి డ్యాన్స్‌ వీడియో.. 

ముంబై :  భోజ్‌పురి ఫిల్మ్‌ ఇండస్ట్రీ నటి ఆమ్రపాలి దుబే ‘బెల్లి డ్యాన్స్‌’ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘లవ్‌ కే లియే కుచ్‌ బి కరేగా’ మూవీలోని తోహరే ఖతిర్‌ అనే వీడియో పాటను మూవీ యూనిట్‌ వాళ్లు ఎస్‌ఆర్కే మ్యూజిక్‌ యూట్యూబ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కాగా, తన బృందంతో కలిసి నటి ఆమ్రపాలి వేసిన స్టెప్పులకు వీక్షకులు ముగ్దులవుతున్నారు. ఈ నెల 9న పోస్ట్‌ చేసిన వీడియో సాంగ్‌ ఇప్పటికే 82 లక్షల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

తెలుపు, ఎరుపు రంగుతో ఉన్న ఘాగ్రా చోలీలో ఆమ్రపాలి మరింత ఆకర్షనీయంగా కనిపించారు. ఇందు సోనాలి, అనుజ్‌ తివారీలు ఈ వైరల్‌ పాటకు గాత్రదానం చేశారు. దీరజ్‌ ఠాకూర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని గాయత్రి క్రియేషన్స్‌ బ్యానర్‌లో సతీశ్‌ దుబే, సునీల్‌ సింగ్‌లు నిర్మించారు. పలు టీవీ షోల్లోనూ నటి ఆమ్రపాలి తనదైన ముద్రవేశారు. నిరాహువా హిందూస్తానీ మూవీతో 2014లో భోజ్‌పురి ఇండస్ట్రీకి ఆమె పరిచయం అయ్యారు. కాగా, అత్యధిక పారితోషికం అందుకుంటోన్న హీరోయిన్లలో ఆమె ఒకరన్న విషయం తెలిసిందే.

ఆమ్రపాలి డ్యాన్స్‌ వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement