అమ్మాయంటే అలుసా దిశకు అంకితం | Ammayante Alusa Audio Launch | Sakshi
Sakshi News home page

అమ్మాయంటే అలుసా దిశకు అంకితం

Dec 30 2019 6:41 AM | Updated on Dec 30 2019 6:41 AM

Ammayante Alusa Audio Launch - Sakshi

ప్రతాని రామకృష్ణ, నేనే శేఖర్, రామసత్యనారాయణ

‘‘స్టార్‌ హీరోలు, దర్శకుల దగ్గర ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేశాను. తొలిసారి నిర్మాతగా మారి సినిమా తీశాను. అనుకోని ఇబ్బందుల వల్ల సినిమా ఆగిపోతే నా భార్యకు తెలియకుండా ఇల్లు అమ్మేసి సినిమా పూర్తి చేశాను’’ అన్నారు నేనే శేఖర్‌. ఆయన హీరోగా, దర్శక–నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. కార్తీక్‌ రెడ్డి, స్వాతి, శ్వేత, ఆర్తి ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ విడుదల చేశారు.‘‘ప్రస్తుత సమాజానికి ఎటువంటి కథ అయితే బావుంటుందో తెలిసినవాడు శేఖర్‌’’ అన్నారు నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌. ‘‘ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత రామసత్యనారాయణ. ‘‘ఈ సినిమాను దిశకు అంకితం చేస్తున్నా’’ అన్నారు నేనే శేఖర్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement