ప్రశ్నకు ప్రశ్న | Alia Bhatt on her relationship with Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

ప్రశ్నకు ప్రశ్న

Dec 15 2018 2:15 AM | Updated on Dec 15 2018 2:15 AM

Alia Bhatt on her relationship with Ranbir Kapoor - Sakshi

ఆలియా భట్

ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ముంబైలో అందరికీ తెలుసు. ‘ఇది అర్థం అవ్వడానికి గొప్ప తెలివితేటలేం అక్కర్లేదు’ అంటారు ఆలియా తండ్రి మహేశ్‌ భట్‌. కానీ ప్రేమ సంగతి మాత్రం ఆలియా, రణ్‌బీర్‌ అఫీషియల్‌గా ఒప్పుకోరు. రీసెంట్‌గా ఆలియా ట్వీటర్‌లో తన అభిమానులతో చాట్‌ చేశారు. ఆలియా, రణ్‌బీర్‌ ప్రేమ విషయాన్ని స్వయంగా ఆలియా భట్‌ ద్వారానే చెప్పించాలనుకున్నాడు ఓ తుంటరి ఫ్యాన్‌.

‘‘మిమ్మల్ని ఆలియా కపూర్‌ అని పిలవొచ్చా?’ అని సూటిగా ప్రశ్నను సంధించాడు. అంత సులువుగా ఒప్పుకోవాలనుకోలేదు ఆలియా. అలాగని ఆ ప్రశ్ననుంచి తప్పించుకోవాలనీ అనుకోలేదు. వెంటనే ఆ ప్రశ్న అడిగిన హిమాన్షూ కకానీకి ‘మిమ్మలి హిమాన్షూ భట్‌ అని పిలవొచ్చా?’ అని తిరిగి ప్రశ్నించారామె. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా. మరి సమాధానం దొరికేదెప్పుడబ్బా అంటే... కాలమే చెబుతుంది అనుకోవాలి.

Advertisement
 
Advertisement
Advertisement