ఐష్ ఫీస్ట్ | Aishwarya Rai Bachchan is a stunner on the third day at Cannes 2016 | Sakshi
Sakshi News home page

ఐష్ ఫీస్ట్

May 14 2016 11:54 PM | Updated on Sep 4 2017 12:06 AM

శుక్రవారం కాన్స్ చలనచిత్రోత్సవాలు అంతకు ముందు రెండు రోజుల్లానే పసందుగా జరిగాయి.

 శుక్రవారం కాన్స్ చలనచిత్రోత్సవాలు అంతకు ముందు రెండు రోజుల్లానే పసందుగా జరిగాయి. కానీ, ఆరోజు కాన్స్ వేదిక కొత్త శోభ సంతరించుకుంది. దానికి కారణం అందాల సుందరి ఐశ్వర్యా రాయ్ పాల్గొనడం. అందంగా ముస్తాబై, ఎర్ర తివాచీ మీద మెరిశారు ఐష్. ఎప్పటిలా తనదైన శైలిలో గాల్లో ముద్దులు విసిరి సందడి చేశారు. దాదాపు ఏడాది క్రితం ఇదే ఉత్సవాల్లో ఫిజిక్ వైజ్‌గా ఐష్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ, ఈసారి మాత్రం మెరుపు తీగలా కనిపించి, కనువిందు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement