చరణ్ కోసం 5 కోట్లతో భారీ సెట్ | 5 crores set for Ram charan Rangasthalam 1985 | Sakshi
Sakshi News home page

చరణ్ కోసం 5 కోట్లతో భారీ సెట్

Jul 19 2017 1:48 PM | Updated on Sep 5 2017 4:24 PM

చరణ్ కోసం 5 కోట్లతో భారీ సెట్

చరణ్ కోసం 5 కోట్లతో భారీ సెట్

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్లో దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి నది, పల్లెటూరికి సంబంధించిన కొన్ని సీన్స్ను షూట్ చేశారు. త్వరలో మరో భారీషెడ్యూల్కు రెడీ అవుతున్నారు.

నెక్ట్స్ షెడ్యూల్ కోసం 5 కోట్లతో భారీ సెట్ను రూపొందిస్తున్నారు. 1980ల నాటి వాతావరణం కనిపించేలా ఓ గ్రామాన్ని ఆర్టిఫిషియల్గా నిర్మిస్తున్నారు. దాదాపు 35 రోజులపాటు ఈ సెట్ లోనే షూటింగ్ జరగనుంది. చరణ్తో పాటు సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్న హీరోయిన్ సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయలో ఈ షూటింగ్లో పాల్గొననున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement