చెత్త గిఫ్ట్‌, కానీ ఆ చిన్నారి రియాక్షన్‌! | Viral Video: Worst Christmas Gift But Toddler Reaction Awesome | Sakshi
Sakshi News home page

వైరల్‌: చెత్త గిఫ్ట్‌ ఇచ్చినా కేరింతలు కొట్టిన చిన్నారి

Dec 23 2019 3:32 PM | Updated on Dec 23 2019 5:01 PM

Viral Video: Worst Christmas Gift But Toddler Reaction Awesome - Sakshi

క్రిస్మస్‌ పండుగ వస్తుందంటే.. చిన్నారుల హడావుడి చెప్పనలవి కాదు. స్వీట్లు, కేకులు, సర్‌ప్రైజ్‌లు అబ్బో.. ఇది పిల్లలు మర్చిపోలేని పండగ అనుకోండి. చిన్న గిఫ్ట్‌ అందుకున్నా సరే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అయితే ఇక్కడ చెప్పుకునే చిన్నారికి ఇచ్చిన గిఫ్ట్‌ చూస్తే షాకవకుండా ఉండలేరు. యూట్యూబర్‌ జస్టిస్‌ మొజికా తన రెండేళ్ల కూతురితో ప్రాంక్‌ వీడియో చేద్దామనుకుంది. క్రిస్‌మస్‌ పండగ సందర్భంగా కూతురికి గిఫ్ట్‌ ప్యాక్‌ చేసి తీసుకొచ్చింది. చిట్టిచిట్టి చేతులతో గిఫ్ట్‌ను తెరచి చూస్తే అందులో ఉన్నది అరటిపండు. కానీ ఆ చిన్నారి తల్లి ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. వినడానికి ఒకింత ఆశ్చర్యం కలిగించినా నమ్మక తప్పదు.

పాపం, పసిపిల్లకు అరటిపండు ఇచ్చి మోసం చేశారని మనకు కోపం రావచ్చు కానీ ఆ చిన్నారి రియాక్షన్‌ చూసి ముచ్చటపడని నెటిజన్‌ ఉండడంటే నమ్మండి. అరటిపండును అందుకున్న చిన్నారి అమితాశ్చర్యంతో కళ్లింత చేసుకుని ఆనందంతో గంతులు వేసింది. ‘బనానా.. బనానా..’ అంటూ కేరింతలు కొట్టింది. ఎంతగానో సంబరపడింది. ముద్దుముద్దు మాటలతో అరటి పండు తొక్కతీసి ఇవ్వమని తల్లిని అడిగింది. తొక్కతీయగానే వెంటనే పట్టలేని సంతోషంతో అరటింపడును అమృతంలా ఆరగించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 20 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement