వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్‌ కన్నుమూత | Vietnam President Tran Dai Kwang passes away | Sakshi
Sakshi News home page

వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్‌ కన్నుమూత

Sep 22 2018 5:38 AM | Updated on Sep 22 2018 5:38 AM

Vietnam President Tran Dai Kwang passes away - Sakshi

వియత్నాం అధ్యక్షుడు ట్రాన్‌ డాయ్‌ క్వాంగ్‌

హనొయి/న్యూఢిల్లీ: వియత్నాం అధ్యక్షుడు ట్రాన్‌ డాయ్‌ క్వాంగ్‌ (61) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు వియత్నాం అధికారిక మీడియా తెలిపింది. క్వాంగ్‌ 2016 ఏప్రిల్‌లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకంటే ముందు 4 దశాబ్దాల పాటు కీలకమైన ప్రజా భద్రత మంత్రిగా చేశారు. శక్తిమంతమైన నేతగా క్వాంగ్‌కు మంచి పేరుంది. దేశ అధ్యక్ష పదవితో పాటు మరో నాలుగు దేశ అత్యున్నత పదవుల బాధ్యతలను క్వాంగ్‌ నిర్వర్తిస్తున్నారు. కమ్యూనిస్ట్‌ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న క్వాంగ్‌.. పార్టీ అంతర్గత వర్గాల్లో మంచి ప్రభావవంతమైన, గట్టి నేతగా పేరు సంపాదించుకున్నారు. వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్‌ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement