త్రీడీ డ్రెస్.. అదుర్స్..! | Up .. three .. Kareena! | Sakshi
Sakshi News home page

త్రీడీ డ్రెస్.. అదుర్స్..!

Dec 15 2014 4:24 AM | Updated on Sep 2 2017 6:10 PM

త్రీడీ డ్రెస్.. అదుర్స్..!

త్రీడీ డ్రెస్.. అదుర్స్..!

ఆధునిక ఫ్యాషన్ ప్రపంచం సరికొత్త శిఖరాలకు చేరుకుందని చెప్పడానికి ఈ భామ వేసుకున్న డ్రెస్సే నిదర్శనం.

ఆధునిక ఫ్యాషన్ ప్రపంచం సరికొత్త శిఖరాలకు చేరుకుందని చెప్పడానికి ఈ భామ వేసుకున్న డ్రెస్సే నిదర్శనం. దీనిని త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించారు. అతివల శరీరాకృతికి సరిగ్గా సరిపోయేలా దుస్తులు రూపొందించడం ఈ విధానం ప్రత్యేకత. తొలుత యువతి శరీరాకృతిని త్రీడీ స్కానింగ్ చేస్తారు.

అనంతరం ఆమెకు నచ్చిన డిజైన్‌తో సరిగ్గా ఒంటికి సరిపోయేలా త్రీడీ ప్రింటర్ ద్వారా డ్రెస్ ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. అమెరికా మసాచుసెట్స్‌కు చెందిన ఓ డిజైన్ స్టూడియో ఈ వినూత్న ఆవిష్కరణ చేసింది. ఒక్క డ్రెస్‌ను ప్రింట్ చేయడానికి 48 గంటల సమయం పడుతుందని, ఇందుకు 3వేల డాలర్లు (దాదాపు రూ.1.80 లక్షలు) ఖర్చవుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement