అమ్మాయి కదాని సెల్ఫీ దిగితే..! | Selfie with victim lands robber in jail | Sakshi
Sakshi News home page

అమ్మాయి కదాని సెల్ఫీ దిగితే..!

Jan 4 2016 2:11 PM | Updated on Aug 30 2018 5:24 PM

అమ్మాయి కదాని సెల్ఫీ దిగితే..! - Sakshi

అమ్మాయి కదాని సెల్ఫీ దిగితే..!

దొంగతనం చేయడం వరకు ఓకే.. చేసిన తర్వాత బాధితులతో సెల్ఫీలు దిగాడు. అక్కడితో కూడా ఆగలేదు. ఆ ఫొటోలను స్నాప్‌చాట్‌లో షేర్ చేశాడు. అంతే.. పోలీసులకు దొరికిపోయాడు.

దొంగతనం చేయడం వరకు ఓకే.. చేసిన తర్వాత బాధితులలోని ఓ మహిళతో సెల్ఫీలు దిగాడు. అక్కడితో కూడా ఆగలేదు. ఆ ఫొటోలను స్నాప్‌చాట్‌లో షేర్ చేశాడు. అంతే.. పోలీసులకు దొరికిపోయాడు. విక్టర్ అల్మాంజా మార్టినెజ్ అనే 18 ఏళ్ల యువకుడిని దోపిడీ నేరం మీద పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీలో అతడితో పాటు పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. విక్టర్, అతడి ఇద్దరు స్నేహితులు కలిసి కాలిఫోర్నియాలోని లోవర్ పార్క్ ప్రాంతంలో ఓ ఇంటికి వెళ్లారు.

అక్కడివాళ్లను తుపాకులతో బెదిరించి, వాళ్ల కారుతో సహా విలువైన వస్తువులు దోచుకుపోయారు. బాధితుల కుటుంబంలో ఉన్న ఓ మహిళ విక్టర్‌తో స్నాప్‌చాట్ సమాచారం షేర్ చేసుకుంది. ఇద్దరూ కలిసి ఓ సెల్ఫీ కూడా దిగారు. ఆ సెల్ఫీ ఆధారంగా విక్టర్‌ను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. సాయుధ దోపిడీ, కిడ్నాప్ నేరాలు అతడిమీద మోపి ప్రస్తుతం మాంటెరీ కౌంటీ జైల్లో పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement