పుతిన్‌ భారత పర్యటన ఖరారు..! | Russian President Vladimir Putin India Tour Conform | Sakshi
Sakshi News home page

పుతిన్‌ భారత పర్యటన ఖరారు..!

Sep 28 2018 6:36 PM | Updated on Sep 28 2018 6:36 PM

Russian President Vladimir Putin India Tour Conform - Sakshi

వ్లాదిమిర్‌ పుతిన్‌ (ఫైల్‌ ఫోటో)

పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు...

సాక్షి, న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు, వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌ పర్యటన ఖరారైంది. అక్టోబర్‌ 4,5 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్‌-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పుతిన్‌ పాల్గోననున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరు దేశాల నేతల అధినేతలు జూలైలో జరిగిన బ్రిక్స్‌ సమావేశంలో చివరి సారిగా భేటీ అయిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement