45 కోట్ల నగల దోపిడీ | Kim Kardashian robbed of €10 million in armed Paris raid | Sakshi
Sakshi News home page

45 కోట్ల నగల దోపిడీ

Oct 4 2016 2:55 AM | Updated on Aug 3 2018 3:04 PM

45 కోట్ల నగల దోపిడీ - Sakshi

45 కోట్ల నగల దోపిడీ

రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌కు పారిస్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఐదుగురు దుండగులు కిమ్‌ను తుపాకీతో...

పారిస్: రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌కు పారిస్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఐదుగురు దుండగులు కిమ్‌ను తుపాకీతో బెదిరించి సుమారు రూ.45 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో (స్థానిక కాలమానం) కిమ్ బస చేస్తున్న హోటల్ గదిలోకి పోలీసు దుస్తుల్లో ఐదుగురు వ్యక్తులు చొరబడ్డారు. మొహానికి ముసుగులేసుకున్న ఆ దుండగులు.. కిమ్‌ను తుపాకీతో బెదిరించి రూ.45 కోట్ల (6.7 మిలియన్ డాలర్లు) విలువైన నగలతో ఉడాయించారు. ఘటనలో కిమ్‌కు ఎలాంటి హాని జరగలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. న్యూయార్క్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన కిమ్ భర్త కాన్యే.. విషయం తెలియగానే పారిస్‌కు బయలుదేరారు.

Advertisement
 
Advertisement
Advertisement