ట్రంప్‌తో కుదరలేదు.. కారుతోనే సెల్ఫీ | Indian selphie with trumph's car | Sakshi
Sakshi News home page

ట్రంప్‌తో కుదరలేదు.. కారుతోనే సెల్ఫీ

Jun 13 2018 1:21 AM | Updated on Aug 25 2018 7:52 PM

Indian selphie with trumph's car - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కారు ముందు నిల్చొని సెల్ఫీ దిగుతున్న ఈ యువకుడు భారత సంతతికి చెందిన మహరాజ్‌ మోహన్‌(25). మలేసియాలో నివాసముంటున్న మోహన్‌ ట్రంప్‌ను కలవాలనే కోరికతో సింగపూర్‌ వెళ్లి, ట్రంప్‌ దిగిన హోటల్‌లోనే బస చేశాడు.

ఇందుకోసం అతను ఒక్కరోజుకే రూ.38 వేలు చెల్లించాడు. మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి లాబీ బయట నిల్చుని పడిగాపులు కాసిన మోహన్‌కు 8 గంటలకు ట్రంప్‌ బయటకు వెళ్తున్న సమయంలో కనిపించారు. ట్రంప్‌తో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఆయన కారుతో సెల్ఫీ దిగి సంతృప్తి పొందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement