కరోనా మంచి, చెడులకు ఆన్‌లైన్‌ వేదిక | Sakshi
Sakshi News home page

కరోనా మంచి, చెడులకు ఆన్‌లైన్‌ వేదిక

Published Tue, Jun 9 2020 5:22 PM

Coronavirus Lost And Found - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనావైరస్‌ కట్టడి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మిగిల్చిన విషాధాలతోపాటు కలిగించిన ఆనందాలు ఎక్కువే ఉంటాయి. పోవాలనుకున్న చోటుకు పోక పోవడం, కలవాలనుకున్న వారిని కలుసుకోలేక పోవడం, కావాల్సిన వారు కరోనా కారణంగా దూరమడం లాంటి ఎన్నో సంగతులు విషాధాన్ని మిగిల్చితే, ఎటు పోవడానికి వీలులేక కుటుంబ సమేతంగా ఇళ్లలో ఉండడం వల్ల మునుపెన్నడు లేని విధంగా ఆప్యాయతా అనుబంధాలు పెనవేసుకు పోవడం, క్వారంటైన్‌ కాలంలో శారీరక వ్యాయామం, క్రీడలను ఆశ్రయించడం ద్వారా ఆరోగ్యాన్ని సముపార్జించుకోవడం, సమయం దొరికింది కాబట్టి ఈ మెయిళ్ల ద్వారానో, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారానో కొత్త బంధాలు ఏర్పరడడం మరచిపోలేని తీపి గుర్తులు. (చదవండి : లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: ఆహార రంగంలోకి టెక్‌ కంపెనీలు)

ఇలాంటి అనుభవాలను నిక్షిప్తం చేయడం కోసం అమెరికాలోని మేరీలాండ్‌ యూనివర్శిటీలో ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మీడియా కమ్యూనికేషన్స్‌ స్టడీస్‌’లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న రెబెక్కా ఏ అడెల్మన్‌ ‘కరోనా వైరస్‌ లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌’ పేరిట ఆన్‌లైన్‌ ప్రజా అనుభూతుల భాండాగారాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రస్తుతం అమెరికాతోపాటు భారత్‌లాంటి పశ్చిమాసియా దేశాల నుంచి ఎక్కువ స్పందన లభిస్తోందని రెబెక్కా తెలిపారు.

Advertisement
Advertisement