కన్ను కొట్టిన కెమిల్లా !

Camilla Parker Bowles gave a wink behind Trump's back - Sakshi

ప్రియా వారియర్‌.. రాహుల్‌ గాంధీ.. తాజాగా బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ చార్లెస్‌ భార్య కెమిల్లా పార్కర్‌ కన్ను కొట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారారు. బ్రెగ్జిట్‌ నేపథ్యంలో బ్రిటన్‌తో సంబంధాలు బలోపేతానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా లండన్‌కి  వచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్స్‌ చార్లెస్‌ వారికి ఆతి«థ్యమిచ్చారు. వారితో కలసి ఫొటో దిగాక చార్లెస్‌ భార్య కెమిల్లా పార్కర్‌..ట్రంప్‌ వెనుక నడుస్తూ పక్కకి తిరిగి కన్ను కొట్టారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

అయితే ఆమె ఎందుకు కన్ను గీటారనేది అర్ధం కాని విషయంగా మిగిలింది. బ్రిటన్‌ రాజకుటుంబీకురాలు కెమెరాల సాక్షిగా కన్ను కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరికి తోచిన విధంగా వారు కారణాలు చెబుతున్నారు. మలయాళీ కుట్టి ప్రియా వారియర్‌ ఓ సినిమా కోసం కన్ను కొట్టే ఒకే ఒక్క సీన్‌ దేశం మొత్తాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గత ఏడాది పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీని కౌగిలించుకొని వచ్చి తన సీట్లో కూర్చొని జ్యోతిరాదిత్య సింధియావైపు చూస్తూ కన్ను కొట్టడం కూడా చర్చనీయాంశమయ్యింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top