సహోద్యోగులను చంపిన ‘ఉగ్రపోలీసు’ | Afghan Taliban kill 11 police officers in Helmand province attack | Sakshi
Sakshi News home page

సహోద్యోగులను చంపిన ‘ఉగ్రపోలీసు’

Mar 1 2017 2:22 AM | Updated on Mar 28 2019 6:10 PM

అఫ్గాన్ లో సహోద్యోగులపై ఓ పోలీసు దారుణానికి తెగబడ్డాడు.

కాందహార్‌: అఫ్గాన్ లో  సహోద్యోగులపై ఓ పోలీసు దారుణానికి తెగబడ్డాడు. సోమవారం అఫ్గాన్ లోని హెల్మాండ్‌లోని దక్షిణ ప్రాంతం సమీపంలోని ఓ చెక్‌పోస్టు వద్ద సహోద్యోగులపై తాలిబన్  ఉగ్ర సంస్థతో సంబంధాలున్న ఓ పోలీసు జరిపిన కాల్పుల్లో 11 మంది పోలీసులు మృతి చెందారు.

పోలీసు శిబిరంలో నిద్రిస్తున్న పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైంది. కాల్పుల అనంతరం పోలీసు శిబిరంలో ఉన్న ఆయుధాలను తీసుకుని పారిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement