
చికెన్ ముక్క కోసం తుపాకీ గురి పెట్టాడు!
డబ్బుల కోసం, బంగారం కోసం తుపాకీ ఎక్కు పెట్టి బెదిరించిన సంఘటనలు ఇప్పటి వరకు చూసే ఉంటాం...
అమెరికాలో ఓ బాలుడి నిర్వాకం
న్యూయార్క్: డబ్బుల కోసం, బంగారం కోసం తుపాకీ ఎక్కు పెట్టి బెదిరించిన సంఘటనలు ఇప్పటి వరకు చూసే ఉంటాం... కానీ ఇందుకు భిన్నంగా కేవలం చికెన్ ముక్క కోసం ఓ బాలుడు తన క్లాస్‌మెట్‌పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్లేమ్‌లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ఓ పన్నెండేళ్ల బాలుడు తన క్లాస్‌మెట్ అయిన ఓ బాలికను కలిశాడు. ఆ బాలిక తింటున్న చికెన్‌లో తనకు ఓ ముక్కను ఇవ్వాలని అడిగాడు. అందుకు బాలిక తిరస్కరించింది. ఆ తర్వాత బయటికి వెళ్లిన బాలిక తలపై తుపాకీ ఎక్కుపెట్టి చికెన్ ముక్క ఇవ్వాలని బెదిరించాడు.
దీనికి భయపడిన బాలిక... తుపాకీని పక్కకు తోసి తనను వదిలివేయమని ప్రాధేయపడటంతో విడిచిపెట్టాడు. అయితే మరుసటి రోజు ఈ విషయాన్ని పాఠశాలలోని ఉపాధ్యాయులకు బాలిక చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ అబ్బాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలుడు బెదిరించిన తుపాకీ దొరక్కపో వడంతో.. అది నిజమైనదా.. కాదా అనే విషయం నిర్ధారణ కాలేదు.