హెచ్ఎస్బీసీలో 1,195మంది నల్ల కుబేరులు | 1,195 Indians have accounts in HSBC bank, report says | Sakshi
Sakshi News home page

హెచ్ఎస్బీసీలో 1,195మంది నల్ల కుబేరులు

Feb 9 2015 12:55 PM | Updated on Apr 3 2019 5:16 PM

నల్లధనం వెలికితీతలో స్విస్ మరో అడుగు ముందుకేసింది.

న్యూఢిల్లీ : నల్లధనం వ్యవహారంలో భారత్తో కుదుర్చుకున్న ఒప్పందంతో స్విస్ బ్యాంక్ ఇప్పటికే 628 మంది సమాచారాన్ని సిట్కు సమర్పించింది. తాజాగా లండన్లోని హెచ్ఎస్బీసీలో 1195 మంది భారతీయులకు అకౌంట్లు ఉన్నట్టు వెల్లడించింది.  ఆ నివేదిక ప్రకారం భారతీయుల అకౌంట్స్ మొత్తం విలువ రూ.25,420 కోట్లు ఉంటుందని అంచనా.

ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు (ఐసీఐజే) ల దర్యాప్తులో ఈ నల్లధనం వెలుగులోకి వచ్చింది. నల్లధనాన్ని బయటికి తేవాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రిమినల్స్, బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అవినీతి సొమ్మును స్విస్ బ్యాంకుల్లో దాచి ఉంటారని తనిఖీలు నిర్వహించినట్టు ఐసీఐజే జర్నలిస్టు ఒకరు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement