గ్రేటర్‌ ఎన్నికలు: టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల | TRS manifesto released by TRS party for Greater elections | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ ఎన్నికలు: టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల

Jan 23 2016 10:25 AM | Updated on Sep 3 2017 4:10 PM

గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం 15 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో త్వరలో జరగనున్న గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం 15 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ పొందుపరిచిన విషయాలు ఈ కింది విధంగా ఉన్నాయి..
విశ్వనగరంగా హైదరాబాద్‌ మార్చడం
ట్రాఫిక్‌ చిక్కులు లేని ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ
నిరంతరం విద్యుత్‌ సరఫరా, స్వచ్ఛ హైదరాబాద్‌
త్వరలో ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు, నగరంలో ఉచిత వై-ఫై
ప్రైవేట్‌ స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణకు కఠిన నిబంధనలు
ప్రభుత్వ స్కూల్స్‌లో డిజిటల్‌ తరగతులు, ఆస్తి పన్ను తగ్గింపు
నగరంలో 17 ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక కార్యాచరణ

Advertisement
 
Advertisement
Advertisement