డ్రైవర్ తీరుపై ముందే డౌట్ వచ్చింది.. | OU medical college students informs travells management | Sakshi
Sakshi News home page

డ్రైవర్ తీరుపై ముందే డౌట్ వచ్చింది..

Mar 15 2016 9:58 AM | Updated on Nov 9 2018 4:12 PM

డ్రైవర్ తీరుపై ముందే డౌట్ వచ్చింది.. - Sakshi

డ్రైవర్ తీరుపై ముందే డౌట్ వచ్చింది..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి డ్రైవర్ తాగి ఉన్నాడని చెప్పినట్లు సమాచారం అందింది.

విజయవాడ: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి డ్రైవర్ తాగి ఉన్నాడని చెప్పినట్లు సమాచారం అందింది. ప్రమాదానికి ముందే డ్రైవర్ వ్యవహారంపై తమకు అనుమానం తలెత్తిందని విద్యార్థులు చెబుతున్నారు. శివ్వరూప్ అనే విద్యార్థి డ్రైవర్ తీరుపై అనుమానం వచ్చి ట్రావెల్స్ వాళ్లకు కాల్ చేసినట్లు తెలిపాడు. వేరే బస్సు డ్రైవర్ కోసం తాము కాల్ చేసినట్లు చెప్పాడు. అయితే, తాను పదేళ్ల నుంచి డ్రైవర్ గా చేస్తున్నానని, తాను ఇదే విధంగా డ్రైవ్ చేస్తానని ఏ అనుమానాలు పెట్టుకోవద్దని డ్రైవర్ విద్యార్థులకు సర్దిచెప్పినట్లు విద్యార్థులు తెలిపారు.

గొల్లపూడి నుంచి కొంతదూరం వెళ్లగానే బస్సును ఆపివేయాలని తాము అరుస్తున్నా డ్రైవర్ పట్టించుకోలేదని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు తమ అరుపులను మరింత పెద్దవి చేయగా, ఆ తొందర్లో డ్రైవర్ వేముల శివ మరింత వేగంగా నడపడం మొదలుపెట్టాలని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని వివరించారు. కృష్ణాజిల్లా గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement